బాల సాహిత్యానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

బాల సాహిత్యానికి పెద్దపీట

Feb 8 2026 3:59 AM | Updated on Feb 8 2026 3:59 AM

బాల స

బాల సాహిత్యానికి పెద్దపీట

మోర్తాడ్‌(బాల్కొండ): పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే వయస్సులోనే కవితలు, కథలు, పద్యాలు, పాటలు రాసే విద్యార్థులను ప్రోత్సహించి భావి కవులుగా, రచయితలుగా తీర్చిదిద్దడానికి బాల సాహిత్య కార్యశాలలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఆదివారం కార్యశాల ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా బాలసాహిత్య కార్యశాలల ఏర్పాటు చేసేందుకు వేసిన కమిటీలో జిల్లా నుంచి డాక్టర్‌ కాసర్ల నరేశ్‌రావు, దేశ్‌ముఖ్‌ ప్రవీణ్‌శర్మలకు చోటు లభించింది. బాల సాహిత్య కార్యశాలలను ఏర్పాటు చేస్తే బాల సాహిత్యాన్ని విస్తృతం చేయొచ్చనే భావనతో తెలంగాణ సారస్వత పరిషత్‌ అడుగులు ముందుకు వేస్తోంది. బాలసాహిత్యంలో ఇప్పటికే జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు రాణిస్తున్నారు. శతక పద్యాలు, కవితలు, కథలు రాసి సాహిత్యలోకంలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. బాల సాహిత్యానికి ప్రత్యేక స్థానం ఉండటంతో బాల కవులు, రచయితలను భావి కవులుగా, రచయితలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తెలంగాణ సారస్వత పరిషత్తు అప్పుడప్పుడు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సాహితీ అభిమానులు కూడా బాల సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు తమవంతు సహకారం అందిస్తున్నారు. జిల్లాలోని బాల సాహితీవేత్తల్లో ఇద్దరిని ఆదివారం నాటి కార్యక్రమం కోసం సారస్వత పరిషత్తు ప్రతినిధులు ఆహ్వానించారు. వారి ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లాలో బాల సాహిత్య కార్యశాలల విస్తరణ జరగనుంది. బాలకవులు, రచయితలను ఒక చోట సమావేశపరిచి వారికి కొన్ని అంశాలను ఇచ్చి కవితలు, పద్యాలు, రచనలకు ప్రతిరూపం కల్పించడానికి ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. బాల సాహిత్య కార్యాశాలల ఏర్పాటు ఆహ్వానించదగిన పరిణామమని సాహితీవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో కార్యశాలల ఏర్పాటుకు

సన్నాహాలు

నేడు రాజధానిలో అంకురార్పణ

దశల వారీగా జిల్లా, డివిజన్‌ల

స్థాయిలో వర్క్‌షాప్‌ల విస్తరణ

జిల్లా నుంచి ఇద్దరు సాహితీవేత్తలకు రాష్ట్ర కమిటీలో చోటు

మంచి ప్రయత్నం

భావితరాల కోసం బాల సా హిత్యాన్ని ప్రోత్సహించేందు కు తెలంగాణ సారస్వత పరిషత్తు చేస్తున్న ప్రయత్నం ఎంతో మంచింది. తెలుగు సాహిత్యంలో బాల సాహిత్యానికి ప్రాధాన్యత ఉంది. బాలకవులు, రచయితల కలాల నుంచి జాలువారే అక్షరమాలిక కోసం ఇలాంటి కృషి అవసరం. – దేశ్‌ముఖ్‌ ప్రవీణ్‌శర్మ,

బాల సాహితీవేత్త, శెట్‌పల్లి

శుభపరిణామం

బాల కవులు, రచయితలను ప్రోత్సహించేందుకు బాల సాహిత్య కార్యశాలలను ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇలాంటి కార్యశాలల వల్ల బాల సాహిత్యానికి పెద్దపీట వేసినట్లు అవుతుంది. భావి కవులు, రచయితలకు ఇది మంచి అవకాశం. – డాక్టర్‌ కాసర్ల నరేశ్‌రావు,

బాల సాహితీవేత్త, నిజామాబాద్‌

బాల సాహిత్యానికి పెద్దపీట 1
1/2

బాల సాహిత్యానికి పెద్దపీట

బాల సాహిత్యానికి పెద్దపీట 2
2/2

బాల సాహిత్యానికి పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement