ప్లీడర్ టు మున్సిపల్ చైర్మన్
బోధన్: పట్టణంలోని గంజ్ ప్రాంతానికి చెందిన మహ్మ ద్ గౌసొద్దీన్ న్యాయవాద వృత్తి నుంచి మున్సిపల్ చైర్మన్‌గా ఎదిగారు. 2005 నుంచి 2010 వరకు మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గౌసొద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా 16 వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో మొత్తం 35 వార్డులు ఉండగా, 18 వార్డుల్లో కాంగ్రెస్, ఏడు వార్డుల్లో టీడీపీ, ఐదు వార్డుల్లో ఎంఐఎం, రెండు టీఆర్‌ఎస్, ఒకటి బీజేపీ, రెండు వార్డుల్లో స్వతంత్రులు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఉండటంతో చైర్మన్‌గా మహ్మద్ గౌసొద్దీన్, మరో న్యా యవాది మాసుల్ సాయిలు ను వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొ ద్దుటూరి సుదర్శన్ రెడ్డి అప్ప ట్లో రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రిగా ఉండగా, ఆయన సహకారంతో గౌసొద్దీన్ పట్టణంలో కీలకమైన అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణ ప్రజల తాగునీటి స మస్య నివారణకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.20 కోట్ల 13 లక్షలతో పైప్‌లైన్‌లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. రూ.6 కోట్ల 25 లక్షలతో సీసీ రో డ్లు, డ్రెయినేజీ లు, కల్వర్టుల నిర్మాణ పనులు పూర్తి చేశారు. రూ.కోటీ 90 లక్షలతో ఇంటింటా చెత్త సేకరణకు 10 ఆటోలు, 6 ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. పాండుఫారం శివారులో రూ.35 లక్షలతో డంపింగ్ యార్డు కోసం 22 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పటికీ ఆ డంపింగ్ యార్డు ఉపయోగంలో ఉంది. ప్రస్తుతం బోధన్‌లో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2005 నుంచి 2010 వరకు
సేవలందించిన గౌసొద్దీన్
ప్రస్తుతం అడిషనల్
పీపీగా విధులు
ప్లీడర్ టు మున్సిపల్ చైర్మన్


