పార్కింగ్ స్థలంగా క్రీడా ప్రాంగణం
మీరు చూస్తున్నది పార్కింగ్ స్థలం అనుకుంటే పొరపాటే అవుతుంది. నవీపేట మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, విద్యార్థులను ఆటల వైపు మళ్లించి వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేయాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం ప్రతీ పంచాయతీ, ఆవాస ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసింది. అధికారుల నిర్లక్ష్యంతో అవి ప్రస్తుతం అక్కరకు రాకుండా పోతున్నాయి. క్రీడా ప్రాంగణాలు అనుకూలంగా లేక యువత ఇబ్బందులు పడుతున్నారు. అనువుగాని చోట ఆటలాడుతూ దెబ్బలు తగిలించుకుంటున్నారు. – రెంజల్


