నాపై దండయాత్రకు వస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

నాపై దండయాత్రకు వస్తున్నారు

Feb 8 2026 3:54 AM | Updated on Feb 8 2026 3:54 AM

నాపై దండయాత్రకు వస్తున్నారు

నాపై దండయాత్రకు వస్తున్నారు

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ మున్సిపాలిటీ ఎ న్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అబద్దాలను ఎండగడుతున్నందునే తనపై కాంగ్రెస్‌ నాయకులు దండయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎ మ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గత నా లుగైదు రోజులుగా భీమ్‌గల్‌లో తిరుగుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏయే పనులను ఆపేిసింది, ప్రజల ను ఎలా మోసం చేసిందో వివరిస్తుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, ఎక్కడ ఓడిపోతామో ననే భయంతో కాంగ్రెస్‌ నాయకులు తనపై మాట ల దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్‌గల్‌ పట్టణంలోని ఆరో వార్డులో శనివారం రాత్రి నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రశాంత్‌రెడ్డి మా ట్లాడారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని పిలిపించి ప్రెస్‌మీట్‌ పెట్టి ‘ప్రశాంత్‌రెడ్డి భీమ్‌గల్‌కు ఏమీ చేయలేదని’ ఆయనతో అబద్దాలు చెప్పించారని అన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి ఆయన వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలకు నిజాలు చెబుతుంటే నన్ను అడ్డుకోవడమే లక్ష్యంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి సునీల్‌రెడ్డి, ఈరవత్రి అనిల్‌, మానాల మోహన్‌రెడ్డి వంటి నాయకులు ప్రభుత్వ కార్లు, పోలీసుల జీపులతో తనపై దండయాత్రకు వస్తున్నారని అన్నారు. ఆరు నెలల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు భీమ్‌గల్‌ వచ్చిన సమయంలో కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఏది అని ప్రశ్నించినందుకు తనతోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో దారుణంగా కొట్టించి అక్రమ కేసులు పెట్టారన్నారు.

మంత్రి ఉత్తమ్‌ వాస్తవాలు

తెలుసుకోకుండా మాట్లాడటం సిగ్గుచేటు

తులం బంగారం అడిగినందుకు

లాఠీలతో కొట్టించి, మాపైనే కేసులు పెడతారా?

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement