జోరుగా మొక్కజొన్న సాగు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న సాగుకే రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్ర భుత్వం ఇస్తున్న మద్దతు ధర కన్నా వ్యాపారులు ఎ క్కువ డబ్బులు ఇస్తుండడంతో విత్తన (సీడ్) మక్క సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రస్తుత యాసంగిలో రైతులు గతేడాదికి (21,482 ఎకరా లు) మించి మొక్కజొన్నను పండిస్తున్నారు. జిల్లా లో 25,202 ఎకరాల్లో మక్క సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. 32,674 ఎక రాల్లో పంటను వేశారు. అంచనా కన్నా 7,472 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. సాగవుతున్న మొత్తం విస్తీర్ణంలో సగానికి పైగా సీడ్ మక్కనే ఉండడం గ మనార్హం. ప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2,400 రైతుకు చెల్లిస్తోంది. వ్యాపారులు గ్రామాల్లోకే వచ్చి సీడ్ మక్కను సాగు చేస్తే బుట్టతోనే కొనుగోలు చేసి ఎక్కువ ధరను చెల్లిస్తున్నారు. దీంతో ఆర్మూర్, బాల్కొండ, రూరల్ నియోజకవర్గాల్లో 90శాతం మంది సీడ్ మక్క సాగు చేస్తున్నారు.
యాసంగిలో అంచనాకు
మించి పెరిగిన విస్తీర్ణం
సీడ్ మక్కకే రైతుల అధిక ప్రాధాన్యం
మద్దతు ధర కన్నా ఎక్కువ చెల్లిస్తున్న వ్యాపారులు


