బీఆర్‌ఎస్ ఒక్క తెల్లరేషన్‌కార్డు ఇవ్వలేదు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క నిరుపేద కుటుంబానికి తెల్లరేషన్‌కార్డు ఇచ్చిన పాపన పోలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. పాత డిజైన్ ప్రకారమే 21–ఏ ప్యాకేజీ పనుల కింద మంచిప్ప ప్రాజెక్టు నిర్మించి 2లక్షల ఎకరాల ఆయకట్టు రైతులకు నీరందిస్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నమన్నారు. అర్హులైన వారందరూ తెల్ల రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


