ప్రజా సంక్షేమానికి బంగారు బాటలు
ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి బంగారు బా టవేస్తుందని ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. భీమ్‌గల్ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు రూ. 25 కోట్లు, రోడ్లకు రూ.12 కోట్లు, అదే విధంగా ఇందిరమ్మ ఇళ్లకు నిధులు మంజూరు చేశామన్నారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం జిల్లాకు పామాయిల్ ఫ్యా క్టరీ మంజూరు చేయాలని సీఎంను కోరారు.


