వ్యవసాయ రంగంలో జిల్లా ముందంజ
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నిజామాబాద్ జిల్లా వ్యవసాయ రంగంలో ముందంజలో ఉందని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలలను మంజూరు చేయగా అందులో ఒకటి నిజామాబాద్ జిల్లాకు దక్కిందన్నారు. అధికంగా వరి పంట పండించిన జిల్లాగా నిజామాబాద్ నిలుస్తుందన్నారు. పామాయిల్ సాగులో దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి జిల్లాకు ఆయిల్‌ఫామ్ సాగుచేసే రైతులకు అండగా ఉంటామన్నారు.


