రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మోపాల్: మండలంలోని మంచిప్ప గ్రామంలో శుక్రవారం నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ –15 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీల్లో 60 మంది క్రీడాకారులు పాల్గొనగా, వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన బాలబాలికలను ఎంపిక చేసినట్లు పీఈటీ దేవేందర్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. సదరు క్రీడాకారులను జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం అభినందించారు. ఎంపికై న క్రీడాకారులు: అనన్య (33 కేజీలు), ప్రణతి (36 కేజీలు), వైశాలి (39 కేజీలు), సృజన (42 కేజీలు), మహేక్ (46 కేజీలు), సాయినాథ్ (38 కేజీలు), విఘ్నేష్ (41 కేజీలు), అమన్ (44 కేజీలు), మహేందర్ (48 కేజీలు), అంశిని (60 కేజీలు), సాయి సుశాంత్ (62 కేజీలు), అరవింద్ (49 కేజీలు), ఆదిత్య (85 కేజీలు). కామారెడ్డి జిల్లా నుంచి.. కావేరి (36 కేజీలు), స్వాతి (42 కేజీలు), లహరిక (54 కేజీలు), జయశ్రీ (58 కేజీలు), ఆనంద్ (58 కేజీలు).
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో కొనసాగుతున్న పీజీ ఇంటిగ్రేటెడ్ (ఐదు సంవత్సరాల) 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 43 మంది విద్యార్థులకు గాను 42 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలంలో అన్నారం, సిర్పూర్, గాదేపల్లి, జీజీ నడ్కుడ, చిన్నయానం, మారంపల్లి, నికాల్‌పూర్, డొంకేశ్వర్ గ్రామాలకు గోదావరి నది ఆనుకుని ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గిపోవడంతో ఆయా గ్రామాల్లో ముంపు భూములు బయటపడుతున్నాయి. దీంతో రైతులు వారి భూముల్లో వరినాట్లు వేస్తున్నారు. శుక్రవారం డొంకేశ్వర్‌లో ఓ రైతు సదరు భూమిలో కూలీలతో నాట్లు వేస్తుండగా, సాక్షి క్లిక్ మనిపించింది. మే, జూన్ నెలల్లో పంట చేతికి అందుతుంది. ఒకవేళ వర్షాలు కురిస్తే భూములన్ని మళ్లీ మునిగిపోతాయని రైతులు పేర్కొంటున్నారు
అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యం
మాక్లూర్: అవినీతి రహిత పాలన అందించటం బీజేపీతోనే సాధ్యమవుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ పరిధిలోగల మాణిక్‌భండార్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి కొమ్ము కాస్తు ఇతర వర్గాల ప్రజలను విస్మరిస్తుందన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 2వ డివిజన్ అభ్యర్థి మారంపలి మోహన్‌ను బలపరచి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటర్లు కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. పార్టీ అభ్యర్థి మారంపల్లి మోహన్, నాయకులు మదారి మమత, శివలాల్, రమేష్‌నాయక్, రాజు, అనీల్‌కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


