సీఎం సభ సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎం సభ సక్సెస్‌

Feb 7 2026 2:55 PM | Updated on Feb 7 2026 2:55 PM

సీఎం

సీఎం సభ సక్సెస్‌

జిల్లా నలుమూలల నుంచి భారీగా

తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని కేశాపూర్‌ శివారులో శుక్రవారం నిర్వహించిన సీఎం సభ (ప్రజాపాలన–ప్రగతిబాట కార్యక్రమం) విజయవంతంగా ముగిసింది. సభకు జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు భా రీగా తరలివచ్చారు. అధికారులు ఏర్పాట్లను పక డ్బందీగా చేపట్టగా, పోలీసులు పట్టిష్ట బందోబస్తు నిర్వహించారు. రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సభాధ్యక్షుడిగా వ్యవహరించగా కార్యక్రమంలో సీఎంతోపాటు పీసీసీ చీఫ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్ర సంగించారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, రాష్ట్ర సహకార చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌హందాన్‌, ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, మా జీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి, ఆ ర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, పీసీసీ డెలిగెట్‌ బాడ్సి శేఖర్‌గౌడ్‌, గడ్కో ల్‌ భాస్కర్‌రెడ్డి, బోర్గాం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సీఎం సభ సక్సెస్‌ 1
1/1

సీఎం సభ సక్సెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement