దరఖాస్తు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు గడువు పొడిగింపు

Feb 7 2026 9:33 AM | Updated on Feb 7 2026 9:33 AM

దరఖాస

దరఖాస్తు గడువు పొడిగింపు

ఖలీల్‌వాడి: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగ యువత ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు తేదీని ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ఎస్సీ సంక్షేమశాఖ డీడీ రాజగంగారాం, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ సోమశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌–1, 2, 3, 4తోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అభ్యర్థులకు ఉచిత వసతితోపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9951199460, 9490511953 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

వీసీలో రాష్ట్ర ఎన్నికల

కమిషనర్‌ రాణి కుముదిని

నిజామాబాద్‌ అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికలలో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, ప్రశాంత వాతావరణంలో పా రదర్శకంగా నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమి షనర్‌ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్‌ నుండి మున్సిపల్‌ ఎన్నికలపై శుక్రవారం ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌ జి ల్లాల జనరల్‌ అబ్జర్వర్లు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అక్రమ మద్యం, డబ్బు, ప్రలోభాలకు గురి చేసే సామగ్రిపై ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నిజామాబాద్‌తోపాటు ఇంచార్జి జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కామారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. వీసీ అనంతరం నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌, ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను నిశితంగా పరిశీలించారు. అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్‌.సత్యనారాయణ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఎంపీ అర్వింద్‌ జిల్లాకు

చేసిందేమీ లేదు..

టీపీసీసీ అధ్యక్షుడు,

ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లాకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంతో మంది పెద్దలు సేవలందించారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ సభలో ఆయన మాట్లాడారు. అర్గుల్‌ రాజారాం నుంచి డి.శ్రీనివాస్‌ వరకు జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 1959లో ఏర్పడిన కరీంనగర్‌ మున్సిపాలిటీని స్మార్ట్‌సిటీగా ప్రకటించిందని, అంతకంటే ముందు ఏర్పడిన 1931 ఏర్పడిన నిజామాబాద్‌ మున్సిపాలిటీని ఎందుకు స్మార్ట్‌సిటీగా ప్రకటించలేదని ఎంపీ అర్వింద్‌కు సవాల్‌ విసిరారు. రెండోసారి ఎంపీగా గెలిచిన అర్వింద్‌ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. మూడు జిల్లాలకు కేంద్రబిందువుగా అధికారిక గెస్ట్‌హౌస్‌ను డిచ్‌పల్లి బైపాస్‌ వద్ద ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీ డాకారులు రాణిస్తున్నందున స్పోర్ట్స్‌ హబ్‌, టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎంను కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని ము న్సిపాలిటీలు, కార్పొరేషన్‌ను కై వసం చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

దరఖాస్తు గడువు పొడిగింపు 1
1/1

దరఖాస్తు గడువు పొడిగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement