చెక్కులు అందజేసిన సీఎం | - | Sakshi
Sakshi News home page

చెక్కులు అందజేసిన సీఎం

Feb 7 2026 9:33 AM | Updated on Feb 7 2026 9:33 AM

చెక్క

చెక్కులు అందజేసిన సీఎం

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలో ఇటీవల గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి చి కిత్స పొందుతూ మృతి చెందిన ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థి కసాయం అందజేశారు. సౌమ్య కుటుంబసభ్యు లు చంద్రకళ, సాయిలు, శ్రావణ్‌లకు రూ.కోటి చెక్కును ఇచ్చారు. గతేడాది విధి నిర్వహణలో భాగంగా దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురై ప్రాణాలు వదిలిన కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.కోటి చె క్కును అందజేశారు. అంతకుముందు జిల్లాలోని 1614 మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు సంబంధించి రూ.200కోట్ల చెక్కును పంపిణీ చేశారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం..

జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.20 కోట్లతో డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఎస్సీ బాలుర, బాలికల హాస్టళ్లు, ఇందల్వాయిలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ సిబ్బంది నివాస గృహాలు, అదనపు సౌకర్యాలు, రూ.600 కోట్లతో ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గా లలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.8.60 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్‌, రూ.1.36 కోట్లతో ఇండోర్‌ స్టేడియం, రూ.18 కోట్లతో సైన్స్‌ ల్యాబ్‌, రూ.43 కోట్లతో ఆడిటోరియం, పరిపాలనా భవనం, సీఎస్‌ఈ భవనం, రూ.21 కోట్లతో నవీపేట మండలం గాంధీనగర్‌ నుంచి బినోలా వరకు, సిరన్‌పల్లి నుంచి నిజాంపూర్‌ వరకు రూ.21 కోట్లతో నిర్మించనున్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

చెక్కులు అందజేసిన సీఎం1
1/1

చెక్కులు అందజేసిన సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement