మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌

Feb 7 2026 9:33 AM | Updated on Feb 7 2026 9:33 AM

మున్స

మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌

1931లో నిజామాబాద్‌

మున్సిపల్‌గా ఏర్పాటు

2005లో కార్పొరేషన్‌గా రూపాంతరం

సుభాష్‌నగర్‌: 1905లో జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో ఇందూరుగా పేరున్న జిల్లాను నిజామాబాద్‌గా నామకరణం చేశారు. 1931వ సంవత్సరంలో నిజామాబాద్‌ మున్సిపాలిటీగా ఏర్పడింది. స్వాతంత్య్రం రాక ముందు నిజాం పాలనలో మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారులు ఉండేవారు. ఎన్నికలు జరగకుండా నామినేటెడ్‌గా చైర్మన్లను నిజాం నవాబులే నియమించేవారని కొందరు పేర్కొంటున్నారు. 1987 సంవత్సరంలో నిజామాబాద్‌ను స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా మార్చారు. తొలుత 36 వార్డులు ఉన్నాయి. 2005లో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. సమీప గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. కార్పొరేషన్‌ను జనాభా ప్రాతిపదికగా 50 డివిజన్లుగా విభజించారు. 2019లో నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేసి, 60 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. 2017లో నిజామాబాద్‌తోపాటు మరో నాలుగు నియోజకవర్గాల్లోని గ్రామాలను కలిపి నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా)గా ఏర్పాటైంది. 2023లో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాలోని 325కు పైగా గ్రామాలను నుడాలో కలుపుతూ ప్రత్యేక జీవో ఇచ్చింది. కాగా, నిజామాబాద్‌ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో కొన్నేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఆయా ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారులను నియమించింది.

కార్పొరేషన్‌ మేయర్లు

మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌ 1
1/1

మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement