వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి..
● ఏడేళ్లలో చేసింది ట్రైలర్ మాత్రమే.. పిక్చర్ అబీ బాకీ హై
● మహేశ్‌కుమార్ గౌడ్‌కు
ఎంపీ అర్వింద్ ధర్మపురి కౌంటర్
సుభాష్‌నగర్: నిజామాబాద్ అభివృద్ధిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తనను ప్రశ్నించే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి హితవుపలికారు. నిజామాబా ద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడేళ్లలో అర్వింద్ చేసిన అభివృద్ధి ఏంటని మహేశ్‌కుమార్ గౌడ్ తా జాగా ప్రశ్నించగా, శుక్రవారం ఎంపీ అర్వింద్ కౌంటర్‌గా ఓ వీడియోను విడుదల చేశారు. ఎంపీగా ఏడేళ్ల లో చేసింది ట్రైలర్ మాత్రమేనని, పిక్చర్ అబీ బాకీ హై అని పేర్కొన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డును నిజామాబాద్ గడ్డపై ఏర్పాటు చేశానని, తద్వారా పసుపు ధరలు పెరిగాయని గుర్తుచేశారు. ఏడు ఆర్వోబీల నిర్మాణంతో ఇందూరు నగర రూపురేఖలు మారుతున్నా యని, మూడు ప్రాంతాల్లో ఆర్‌యూబీల నిర్మాణ ప నులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. రూ.53 కోట్ల వ్యయంతో నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. ముత్కేడ్ –డోన్ స్టేషన్ల మధ్య 418 కిలోమీటర్ల డబ్లింగ్ ప్రాజెక్ట్‌కు, పటాన్‌చెరు –ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఆ ర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారిని నాలు గు లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. బోధన్–బాసర–భైంసా మార్గం ద్వారా నూతన జాతీయ రహదారి ఏర్పడిందని, మూడు కేంద్రీయ విద్యాలయాలు, రెండు న వోదయ విద్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. ‘అర్వింద్ ఫర్ అస్’ హెల్ప్‌లైన్ సెంటర్ ద్వారా గల్ఫ్‌లో మృతి చెందిన 141 మంది మృతదేహాల ను, గల్ఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 508 మందిని స్వదేశానికి రప్పించామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ మీదుగా వందే భారత్ రైలును తీసుకొస్తానని హామీనిచ్చారు.


