కాంగ్రెస్‌ని గెలిపించే బాధ్యత అభ్యర్థులదే..
● సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్ రూరల్: నగరంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత బరిలో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులదేనని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కేశాపూర్ శివారులో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ అభ్యర్థులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ కార్పొరేషన్ బరిలో కాంగ్రెస్ తరఫున మహిళా అభ్యర్థులు సగానికి పైగా ఉన్నారని, ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారబోతున్నార ని పేర్కొన్నారు. గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్ బీఫా మ్ ఇచ్చిందని, టికెట్ వచ్చిన వాళ్లు నిర్లక్ష్యం చేయ వద్దని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లే దాన్ని బట్టే విజయావకాశాలు ఉంటాయన్నారు. అందరినీ కలుపుకొనిపోతే 59 శాతం గెలిచినట్లేనని తెలిపారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని, అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విద్వేషా లు రెచ్చగొడతాయని, మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కై వసం అయిన త ర్వాత మున్సిపల్ మంత్రిగా కావాల్సిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.


