బల్దియా బరిలో బావ, బావమరిది
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ బల్దియా పరిధిలోని 26వ వార్డులో బావ, బావమరిదిలు పోటీలో ఉన్నారు. బావ అంకు దామోదర్, మేన బావమరిది బీర్కూర్ శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర్, బీఆర్‌ఎస్ తరఫున బీర్కూర్ శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు వేశారు. గడిచిన మూడు పర్యాయాలు ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం.
ఆర్మూర్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను మోసం చేశారని ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ మున్ను ఆరోపించారు. పట్టణంలోని 20వ వార్డులో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమకు బీ ఫామ్ ఇస్తామని చెప్పి నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం రెండు సంవత్సరాలుగా 24 గంటలు శ్రమించానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత వినయ్‌రెడ్డి తమను నమ్మించి మోసం చేసారని మండిపడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేసారు.
బల్దియా బరిలో బావ, బావమరిది
బల్దియా బరిలో బావ, బావమరిది


