అభివృద్ధి, సంక్షేమమే మా నినాదం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే మా నినాదం

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

అభివృ

అభివృద్ధి, సంక్షేమమే మా నినాదం

కాంగ్రెస్‌లో చేరిన నాయకులు

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో

రాష్ట్రంలో విధ్వంసం

రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతి రెడ్డి

నిజామాబాద్‌ రూరల్‌ : సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మరోవైపు అనే నినాదంతో ముందుకు సాగుతుందని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని, రాష్ట్రంలో నియంతృత్వ గడీల పాలన కొనసాగిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, వాటి ఫలితంగానే సర్పంచ్‌ ఎన్నికల్లో 60 శాతం ఓట్లు సాధించి అత్యధిక సీట్లు గెలుపొందామని చెప్పారు. త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం నిజామాబాద్‌ కార్పొరేషన్‌తోపాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీల్లో సైతం కాంగ్రెస్‌ విజయం ఖాయమన్నారు. నిజామాబాద్‌ నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. బీజేపీ, ఎంఐఎంలు మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప నగరాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. సమావేశంలో పీసీసీ డెలిగేట్‌ శేఖర్‌ గౌడ్‌, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ తారాచంద్‌, డీసీసీ కార్యదర్శి భాస్కర్‌ రెడ్డి, వివిధ మండల పార్టీ అధ్యక్షులు అమృతాపూర్‌ గంగాధర్‌, సాయిరెడ్డి, నవీన్‌ గౌడ్‌, బాలరాజ్‌, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, ధర్మారం సర్పంచ్‌ వాసు బాబు తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ మండలం పాల్దా సర్పంచ్‌ మున్నూరు ప్రభాకర్‌, ఉప సర్పంచ్‌ మల్లారం రమేశ్‌, ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడు మోహన్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి సమక్షంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో నాయకులు చేరుతున్నారని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు రాజలింగం, బాగారెడ్డి, తిర్మన్‌పల్లి, కొండూర్‌ సర్పంచులు మోహన్‌, సంతోష్‌, కాలూర్‌, ఖానాపూర్‌ డివిజన్‌ అభ్యర్థి అగ్గు భోజన్న తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే మా నినాదం1
1/1

అభివృద్ధి, సంక్షేమమే మా నినాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement