300 మందితో బీజేపీలో చేరిక
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరానికి చెందిన విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్త, యువ నాయకుడు రాజ్‌గణేశ్ బుధవారం ఎంపీ అర్వింద్ సమక్షంలో 300 మంది యువకులతో బీజేపీలో చేరాడు. ఎంపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాజ్‌గణేశ్ చాలాకాలంగా హిందుత్వ భావజాలంతో పనిచేస్తున్నాడని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అభినందనీయమన్నారు. పార్టీ విస్తరణ, సైద్ధాంతిక భావజాలాన్ని కిందిస్థాయికి తీసుకెళ్లేందుకు రాజ్‌గణేశ్ పనిచేశాడన్నారు. భవిష్యత్తులోనూ ఇదేవిధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏపీఈ, ఐపీసీహెచ్, ఐఎంబీఏ 3, 5వ సెమిస్టర్, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్ 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలేజ్, న్యాయ కళాశాలలో జరిగిన పరీక్షలకు మొత్తం 201 మంది విద్యార్థులకు 195 మంది హాజరుకాగా ఆరుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
నందిపేట్(ఆర్మూర్): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్–2026 పరీక్షకు ఏప్రిల్ 20 తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నందిపేట పాలిటెక్నిక్ పిన్సిపాల్ రాజ్‌కుమార్ తెలిపారు. మే 13 న పాలీసెట్ పరీక్ష ఉంటుందన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నందిపేట కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ కోర్సులలో 60 సీట్ల చొప్పున ఉన్నాయని తెలిపారు.
ఎల్లారెడ్డిరూరల్: మున్సిపాలిటీ పరిధిలోని వడ్డె ర కాలనీకి చెందిన గండికోట మల్లేశ్ (35) మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేశ్ బుధవారం తెలిపా రు. మల్లేశ్ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బా ధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మా నసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● ఒకరి మృతి
● మరొకరి పరిస్థితి విషమం
నందిపేట్(ఆర్మూర్): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నందిపేట మండలం చౌడమ్మ కొండూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై శ్యాంరాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. చౌడమ్మ కొండూర్ గ్రామానికి చెందిన కొడపాల్ సాగర్ (30) మంగళవారం రాత్రి 10 గంటలకు బైక్‌పై నందిపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. బైక్‌లపై ప్రయాణిస్తున్న కొడుపుల సాగర్‌తోపాటు శివకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన శివ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడి తండ్రి సాయన్న ఫిర్యాదు మేరకు అతివేగంగా అజాగ్రత్తగా బైక్ నడిపిన వెలుమల ప్రవీణ్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


