ట్రాక్టర్‌ ఢీకొని ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఢీకొని ఒకరి మృతి

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

ట్రాక్టర్‌ ఢీకొని ఒకరి మృతి

ట్రాక్టర్‌ ఢీకొని ఒకరి మృతి

బాన్సువాడ: బీర్కూర్‌ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన మచ్కురి రాజు (35) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ఇటుక ట్రాక్టర్‌ ఢీకొని మృతి చెందాడు. అయితే, రాజు చెట్టుకు ఢీకొని మృతి చెందినట్లు ఇటుక ట్రాక్టర్‌ డ్రైవర్‌ చిత్రీకరించిన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రాజు మిర్జాపూర్‌లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వీరాపూర్‌ వద్ద ఇటుక బట్టీ ప్రాంతంలో అతివేగంతో వస్తున్న ఇటుక ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా ట్రాక్టర్‌ డ్రైవర్‌ రాజు మృతదేహాన్ని చెట్టు పక్కన ఉంచి, చెట్టును ఢీకొని మృతి చెందినట్లు చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజు మృతదేహాన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి ఇటుక బట్టీలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించగా ట్రాక్టర్‌ ఢీకొన్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో రాజు కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు బాన్సువాడలో రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని చెప్పడంతో విరమింపజేశారు. కాగా, భార్య పుట్టిన రోజునాడే భర్త రాజు మృతి చెందడంతో కుటుంబీకులు గుండెలవిసెల రోదించారు.

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన డ్రైవర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement