బ్యాలెట్‌ ముద్రణలో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ ముద్రణలో అప్రమత్తంగా ఉండాలి

Feb 5 2026 7:14 AM | Updated on Feb 5 2026 7:14 AM

బ్యాలెట్‌ ముద్రణలో అప్రమత్తంగా ఉండాలి

బ్యాలెట్‌ ముద్రణలో అప్రమత్తంగా ఉండాలి

సుభాష్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల ముద్రణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. డిస్ట్రిబ్యూషన్‌, పోలింగ్‌ ఏర్పాట్ల గురించి కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నా రు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బ్యా లెట్‌ పేపర్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ ముద్రణ గురించి ఆ రా తీశారు. గోప్యతను పాటిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ముద్రణ చేయించాలని, పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించి జాగ్రత్తగా భద్రపర్చాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రిమినల్‌ చర్యలు ఉంటాయన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా పోలింగ్‌ సిబ్బందిని కేటాయిస్తున్నామని తెలిపారు. ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. సమీ క్షలో డీఆర్‌డీవో సాయాగౌడ్‌, నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement