పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
● జాతీయ పసుపు బోర్డు చైర్మన్
పల్లె గంగారెడ్డి
మాట్లాడుతున్న జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి
డిచ్‌పల్లి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో) సద్వినియోగం చేసుకోవాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సూచించారు. వాల్మార్ట్ మద్దతుతో అమలవుతున్న ఈ–ఫార్మ్ ప్రాజెక్ట్‌లో భాగంగా హక్దర్శక్, డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ సహకారంతో ‘‘ఎఫ్‌పీవోల కోసం ప్రభుత్వ పథకా లను వినియోగించుకోవడం’’ అనే అంశంపై డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి శివారులోని రిసార్ట్‌లో రెండు రోజుల శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి పల్లె గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పసుపు రైతులకు మంచి అవకాశాలు ఉన్నాయని, స్థిరమైన ఆదాయం కోసం సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల సమర్థ వినియో గం ద్వారా ఎఫ్‌పీవోలను బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ప్రాంతీయ అధికారి నరేంద్ర మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత సాంకేతికత ఉపయోగించి రైతులు, ఎఫ్‌పీవోలు ఉత్పత్తి పెంచుకోవాలన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపా ల్ ఎఫ్‌పీవోలకు అందుబాటులో ఉన్న బ్యాంకు రుణాల వివరాలు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అర్హతలు, దరఖాస్తు విధానాలపై హక్దర్శక్ ప్రతినిధులు వివరించారు. సమావేశంలో జేఎంకేపీఎం చైర్మన్ తిరుపతిరెడ్డి, డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల 22 ఎఫ్‌పీవోలకు చెందిన 50 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.


