స్ట్రాంగ్‌ రూంకు మరమ్మతులు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూంకు మరమ్మతులు చేపట్టాలి

Feb 4 2026 7:03 AM | Updated on Feb 4 2026 7:03 AM

స్ట్ర

స్ట్రాంగ్‌ రూంకు మరమ్మతులు చేపట్టాలి

స్ట్రాంగ్‌ రూంకు మరమ్మతులు చేపట్టాలి

ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణరెడ్డి

ఆర్మూర్‌లో కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

ఆర్మూర్‌: ఆర్మూర్‌ పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంతోపాటు కౌంటింగ్‌ కేంద్రానికి మరమ్మతులు చేపట్టాలని ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సూచించారు. పిప్రి రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. కళాశాల భవనంలో పోలింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంతోపాటు కౌంటింగ్‌ హాల్‌ను పరిశీలించారు. ఏడు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సమయంలో హాల్‌లో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. కౌంటింగ్‌కు వచ్చే ఏజెంట్లు, కౌంటింగ్‌ సిబ్బందికి వేర్వేరుగా బారీకేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌తోపాటు భీమ్‌గల్‌ మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సూచించారు. ఆర్మూర్‌లోని క్షత్రియ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం పీవో, ఏపీవోలకు ఎన్నికలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌, కౌంటింగ్‌ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అంకిత్‌, సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, మున్సిపల్‌ కమిషనర్‌ ఉమామహేశ్వర్‌ రావు, డీఈ భరత్‌, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూంకు మరమ్మతులు చేపట్టాలి
1
1/1

స్ట్రాంగ్‌ రూంకు మరమ్మతులు చేపట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement