ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలు సంపూర్ణం
డిచ్‌పల్లి(నిజామాబాద్ రూరల్): డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో వారం రోజులుగా జరుగుతున్న సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం నాకబలి, పుష్ప యాగం, ఉద్వాసన బలి కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు సుమిత్ శర్మ దేశ్ పాండే ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన నాగవెల్లి కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గజవాడ రాందాస్ గుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, సర్పంచ్ లొక్కిడి యాదగిరి, డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, సున్నం పోశెట్టి, సూర మాధురి, ఆసది జితేందర్, ఉప సర్పంచ్ సౌజన్య, వీడీసీ రైటర్ దాసరి అశోక్, క్యాషియర్ రాజారెడ్డి తదితరులు పాల్గొని పూజలు చేశారు. రాత్రి ఏకాంతసేవ కార్యక్రమంతో ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి.
ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలు సంపూర్ణం


