లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం

Feb 3 2026 7:16 AM | Updated on Feb 3 2026 7:16 AM

లక్ష్

లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం

రసవత్తరంగా కుస్తీ పోటీలు

ఘనంగా చక్రస్నానం

బోధన్‌: ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామశివారులో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం సంపూర్ణమయ్యాయి. ఉదయం అష్టముఖి కోనేరులో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు చక్రస్నానం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. విజేతలకు గ్రామపెద్దలు నగదు బహుమతిని ప్రదానం చేశారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామపెద్దలు రాధాకిషన్‌ గౌడ్‌, విజయ్‌కుమార్‌ గౌడ్‌, ఉప్పు సంతోష్‌, మిద్దె చిన్నయ్య, ఉప్పు సురేశ్‌, కిశోర్‌, ఆలయ ఈవో వేణు తదితరులు పాల్గొన్నారు.

కుస్తీ పోటీల్లో తలపడుతున్న మల్లయోధులు

మల్లయోధుడికి నగదు బహుమతి అందజేస్తున్న గ్రామపెద్దలు

లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం 1
1/1

లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement