వైభవంగా సీతారాముల వనవిహారం
డిచ్‌పల్లి(నిజామాబాద్ రూరల్): డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో నిర్వహిస్తున్న తిరుక్కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం సీతారాముల వనవిహారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు సుమిత్ శర్మ దేశ్ పాండే ఆధ్వర్యంలో ఉదయం హోమం, పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం గ్రామశివారులోని మామిడి తోటలో సీతారాముల ఉత్సవమూర్తులను వనవిహారం చేయించారు. ఈ సందర్భంగా చక్రతీర్థం(జాతర) నిర్వహించారు. జాతరలో వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు కాగా, భక్తులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. రాత్రికి సీతారాముల వారిని గజవాహనంపై ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం స్వామి వారి ఏకాంత సేవతో ఉత్సవాలు సంపూర్ణమవుతాయని ఆలయ ప్రధానార్చకులు సుమిత్ శర్మ దేశపాండే తెలిపారు. భక్తులకు గ్రామావృవద్ధి కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. లాల్‌బహదూర్ యూత్ ఆధ్వర్యంలో పానకం, వడపప్పు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గజవాడ రాందాస్ గుప్తా, ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, సర్పంచ్ లొక్కిడి యాదగిరి, డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి, సున్నం పోశెట్టి, సూర మాధురి, ఆసది జితేందర్, సొసైటీ మాజీ చైర్మన్ గజవాడ జైపాల్, బూస సుదర్శన్, వీడీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సీతారాముల వనవిహారం


