బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Feb 3 2026 7:16 AM | Updated on Feb 3 2026 7:16 AM

బల్ది

బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

అదనపు కలెక్టర్‌ అంకిత్‌

పీవో, ఏపీవోలకు శిక్షణ

బోధన్‌టౌన్‌(బోధన్‌): మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ పేర్కొన్నారు. పట్టణంలోని లయన్స్‌ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లకు సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. బోధన్‌ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో పీవోలు, ఏపీవోలు బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాలని, ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా చూడాలన్నారు. మాస్టర్‌ ట్రైనర్లు ఇచ్చిన సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

స్ట్రాంగ్‌ రూంల పరిశీలన

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని విజయ మేరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లను అదనపు కలెక్టర్‌ అంకిత్‌ పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత, సీసీటీవీల పర్యవేక్షణ, సీల్‌ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సామగ్రి పంపిణీ కేంద్రంలో వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు తలత్తెకుండా జాగ్రత్తలు తీసుకుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ వెంట సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహాతో, తహసీల్దార్‌ విఠల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాదవ్‌ కృష్ణ ఉన్నారు.

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ అంకిత్‌ , పాల్గొన్న పీవోలు, ఏపీవోలు

బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి 1
1/1

బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement