గోమాత దీక్ష
● ప్రతి ఏటా సంక్రాంతికి ముందు
మాల వేసేలా నియమాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు నగరంలో గోమాత లను సంరక్షించేందుకు ఇప్పటి కే కొందరు కృషి చేస్తున్నా రు. ఈక్రమంలో ఈ ఏడాది నుంచి గోమాత దీక్ష సైతం చేపట్టారు. ప్రతి జనవరిలో మాత్రమే ఈ దీక్ష ఉంటుంది. నగరానికి చెందిన తెలంగాణ గోప్రచారక్ సేవాసమితి స్టేట్ ఆర్గనైజర్ గున్నాల నవీన్‌కుమార్ ఈ దీక్షను స్వీకరించారు. ఈ నెల 3 నుంచి 13 వరకు ఈ దీక్ష చేయనున్నారు. ఇందులో భాగంగా నేల మీదే నిద్రించడం, రోజుకు ఒకే సారి సాత్వికాహారం భుజించడం చేయనున్నారు. అలాగే నిత్యం గోపూజ చేయనున్నారు. ఈనెల 7న గోప్రచారక్ సేవాసమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, హింగుళాంబ ఆలయం చైర్‌పర్సన్ విజయలత ద్వారా 108 మంది మహిళలతో సామూహిక గోపూజ నిర్వహించారు.
రెంజల్(బోధన్): రెంజల్ ఉప సర్పంచ్ చీలం మానస రాకేష్‌రెడ్డి గ్రామంలోని యువతను సన్మార్గంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. యువత చెడు వ్యసనాలను దూరం చేసేందుకు కృషి చేస్తు న్నారు. ఇందులో భాగంగా గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందిస్తే వారికి రూ. 5వేల నజరానా ప్రకటించారు. సొంత ఖర్చులతో ఉప సర్పంచ్ పనులు చేస్తుండటంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు.


