క్రైం కార్నర్
ట్రాక్టర్ కిందపడి ఒకరి మృతి
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు.ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. పడకల్ గ్రామానికి చెందిన తలారి నరేందర్ (35) రెండేళ్లుగా ట్రా క్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.అదే గ్రామానికి చెందిన గు ద్దేటి రవి కేజ్‌వీల్ ట్రాక్టర్‌ను వేరే చోటికి తరలించడానికి తన ట్రాలీ ట్రాక్టర్‌పై ఎక్కించి ట్రాలీకి ఉన్న పట్టీలు పెడుతున్నాడు. ఆకస్మాత్తుగా ట్రాక్టర్ ముందు కు జరగడంతో నరేందర్ గమనించి ఇంజిన్ వద్దకు వెళ్లి ఆపడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో నరేందర్ కాలుజారి ట్రాక్టర్ కింద పడిపోయాడు. దీంతో ట్రాక్టర్ వెనుక టైరు అతని కాళ్లపై నుంచి వెళ్లగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ట్రాక్టర్ పైనుంచి పడి యువకుడు..
రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్లలో ఓ యువకుడు ట్రాక్టర్ పైనుంచి పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కొడిచర్ల గ్రామానికి చెందిన మేత్రి సాయికుమార్ (18) అనే యువకుడు శుక్రవారం కొడిచర్ల నుంచి పోతంగల్ వెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌ను లిప్ట్ అడిగి ఎక్కాడు. ట్రాక్టర్‌పై అతడు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా జారిపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో బోధన్ ప్రభుత్వా స్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు.
అదృశ్యమైన యువకుడు అనుమానాస్పద స్థితిలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఎక్కపల్లి గ్రామాని కి చెందిన గంగమ్మల భరత్(19) అనే యువకుడు అదృశ్య మై శుక్రవారం అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితి లో మృతిచెందిరట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. వివరాలు ఇలా..ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లిన భరత్ తిరిగి ఇంటికి రాలేడు. దీంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా,కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు. శుక్రవారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో భరత్ మృతిచెంది ఉండటం,అతడి కాళ్లు కట్టేసి ఉండడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వర్ని: వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణ శుక్రవారం తెలిపారు. కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వారు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, వయస్సు సుమారు ముప్పై ఏళ్లు ఉంటాయన్నారు. ఒంటిపై మెరున్ రంగు టీ షర్టు, యాష్ కలర్ కాటన్ ప్యాంటు ధరించి ఉన్నాడని, ఎవరికై నా ఆచూకీ తెలిస్తే వర్ని పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్
క్రైం కార్నర్


