పరీక్షలు వాయిదా వేయాలి | - | Sakshi
Sakshi News home page

పరీక్షలు వాయిదా వేయాలి

Jan 8 2026 9:28 AM | Updated on Jan 8 2026 9:28 AM

పరీక్

పరీక్షలు వాయిదా వేయాలి

పరీక్షలు వాయిదా వేయాలి సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప రిధిలో ఈనెల 17 నుంచి నిర్వహించనున్న పీజీ 3 వ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ వర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు పృద్వీ, సమీర్‌ మాట్లాడుతూ.. యూనివర్సిటీ అధికారులు కనీసం విద్యార్థుల సిలబస్‌ అయిందో కాలేదో అని తెలుసుకోకుండా పరీక్షల నోటిఫికేషన్లను జారీ చేయడం తగదని అన్నారు. అనంతరం పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ సంపత్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్‌ అక్షయ్‌, అశోక్‌, శివ, మనోజ్‌, అనిల్‌, శివ, రాజు, విజయ్‌, మహేశ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధిలో

భాగస్వాములు కావాలి

మోపాల్‌: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్ర జల భాగస్వామ్యం కీలకమని మోపాల్‌ సర్పంచ్‌ ద్యాప రవికుమార్‌ పేర్కొన్నారు. బుధవా రం మండల కేంద్రంలో పారిశుద్ధ్య పనులను ఉపసర్పంచ్‌ రామాగౌడ్‌తో కలిసి ఆయన పరిశీలించారు.గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మురుగుకాలువలు,రోడ్డుపై చెత్తాచెదారం వెంట వెంటనే తొ లగించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రా మాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు చెత్త ను ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని కోరారు. వార్డుసభ్యులు,పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

ఐటీ టవర్‌ సందర్శన

ఖలీల్‌వాడి: నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల విద్యార్థులను నిజామాబాద్‌ ఐటీ టవర్‌ క్షేత్ర పర్యటనకు బుధవారం తీసుకెళ్లినట్లు ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌రెడ్డి బుధవారం తెలిపారు. క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులకు ఐటీ టవర్‌లో ఉన్నటు వంటి వివిధ బహుళ జాతి కంపెనీలపై ఐటీ టవర్‌ ఇన్‌చార్జి హన్మంతు విద్యార్థులకు వివరించారు. ఇంటర్వ్యూ మెలకువలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల పనితీరును తెలియజేశారని టీఎస్‌ కేసీ సమన్వయకర్త రామకృష్ణ తెలిపారు. పర్యటనలో టీఎస్‌ కేసీ మెంటర్‌ శ్రీకాంత్‌, అధ్యాపకులు విజయ, పద్మ, దస్తప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.

కేజీబీవీ తనిఖీ

సిరికొండ: మండలంలోని కేజీబీవీని మండల ప్రత్యేకాధికారి, డీటీడీవో నాగోరావు బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో తరగతి గదులను, వంటశాలను, వంట సామగ్రిని పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న మరమ్మతు పనులను తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌ చందర్‌నాయక్‌, ప్రిన్సిపాల్‌ పర్వీన్‌బేగం ఉన్నారు.

నిజామాబాద్‌అర్బన్‌: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ బ్యూరో ఎస్పీ సాయి శ్రీ అన్నారు. బుధవారం మాణిక్‌ బండార్‌లో ఉన్న కాకతీయ కళాశాలలో సైబర్‌క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్‌ మోసాలకు గురైనప్పుడు వెంటనే గోల్డెన్‌ హవర్‌లో ఫిర్యాదు చేస్తే అనేక ప్రయోజనం ఉంటుందని అన్నారు. అనుమానాస్పద లింకులు వస్తే స్పందించకూడదని సూచించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు డిజిటల్‌ అరెస్ట్‌ ఫ్రాడ్‌ పై నాటికను ప్రదర్శించారు. అనంతరం సైబర్‌ నేరాల నివారణకు విద్యార్థుతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ వెంకటేశ్వరరావు, కాకతీయ ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ రజినీకాంత్‌, విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పరీక్షలు వాయిదా వేయాలి 1
1/4

పరీక్షలు వాయిదా వేయాలి

పరీక్షలు వాయిదా వేయాలి 2
2/4

పరీక్షలు వాయిదా వేయాలి

పరీక్షలు వాయిదా వేయాలి 3
3/4

పరీక్షలు వాయిదా వేయాలి

పరీక్షలు వాయిదా వేయాలి 4
4/4

పరీక్షలు వాయిదా వేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement