క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలి
జక్రాన్‌పల్లి: క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని సర్పంచ్ కాటిపల్లి పద్మ అన్నారు. బుధవారం జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండలో ఉమ్మడి జిల్లా అండర్–14, అండర్–17 స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్, బేస్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ పద్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, పీడీ గంగామోహన్, ఉపస్పంచ్ మహిపాల్, వార్డు సభ్యుడు ఉత్కం శ్రీనివాస్‌గౌడ్, జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, పీఈటీ నాగభూషణం, సుజాత, రమేశ్, జ్యోత్స్న, నవీన్, వీణ, స్వప్న, అనికేత్ తదితరులు పాల్గొన్నారు.


