పీఎఫ్‌వోలపై అవగాహన
ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్(పీఎఫ్‌వో)పై ఆన్‌లైన్ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పీఎఫ్‌వోలో రైతులు భాగస్వాములవడం వల్ల కలిగే అనేక రకాల లాభాలను ఆన్‌లైన్ కార్యక్రమం ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. రైతులు ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేన్‌లో సభ్యులుగా చేరి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ సొంతంగా చేసుకోవడమే కాకుండా ప్రభుత్వం అందించే పలు రకాల రాయితీలను పొంది బలమైన రైతు సంఘాలుగా ఏర్పడాలని సీఈవో తేజ గౌడ్ సూచించారు.


