టోల్ ప్లాజా వద్ద నిరసన
ఇందల్వాయి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో 317 నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఉపాధ్యాయ బాధితులు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద నిరసన తెలిపారు. గత నాలుగేళ్ల నుంచి సుదూర ప్రయాణాలు చేస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, పరిష్కారం కోసం ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన జీవో190 గత నాలుగు నెలల నుంచి అమల్లోకి రావడం లేదన్నారు. సత్వరమే దానిని అమలు చేసి బాధితులందరినీ తమ సొంతజిల్లాలకు పంపాలని బాధిత ఉపాధ్యాయులు కోరారు. కార్యక్రమంలో రాజేశ్, వినాయక్, నర్సయ్య, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


