డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌గా రామ్మోహన్‌రావు
సుభాష్‌నగర్: తెలంగాణ ఆల్ పెన్షనర్స్– రిటైర్డ్ ప ర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌గా నిజామాబాద్ జిల్లా పెన్షనర్స్ యూనియ న్ నాయకుడు రామ్మోహన్‌రావు ఎన్నికయ్యా రు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్–రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలలో ఆయనను ఎన్నుకున్నారు. దీంతో రామ్మోహన్‌రావుకు జిల్లా అధ్యక్షుడు సిర్ప హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి ఈవీఎం నారాయణ శుభాకాంక్షలు తెలిపారు.
ఖలీల్‌వాడి: నగరంలోని గిరిరాజ్ కాలేజీలో జరిగే నేషనల్ సెమినార్ బ్రోచర్స్‌ను మంగళవారం తెయూ రిజిస్ట్రార్ యాదగిరి అవిష్కరించారు. త్వరలో జరుగనున్న ఈ సెమినార్‌లో డిజిటల్ వేవ్స్ ఇన్ కామర్స్, ఆపర్‌ుచ్యనిటీస్ అండ్ ఛాలెంజ్ ఆనే ఆంశంపై చర్చించనున్నట్లు తెయూ కామర్స్ హెచ్‌వోడీ సంపత్ కుమార్ తెలిపారు.
సుభాష్‌నగర్: తెలంగాణ వైద్యారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రాష్ట్ర అధ్యక్షుడు రాబర్ట్ బ్రూస్ తెలిపారు. ఈసందర్భంగా అతడికి నియామక పత్రాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని సంఘ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అందజేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం, సంఘం బలోపేతం కోసం కృషిచేస్తానని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
నవీపేట: మండలంలోని కమలాపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ టీచర్ మాధవిపై వచ్చిన ఆరోపణలపై మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం విచారణ చేశారు. రికార్డులు సరిగ్గా లేవని, కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు ఇటీవల ఐసీడీఎస్ సీడీపీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, సీడీపీవో జ్యోతి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు భాగ్యలక్ష్మి, విశాల గ్రామస్తుల ఆధ్వర్యంలో విచారణ జరిపారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. విచారణ అనంతరం అంగన్‌వాడీ టీచర్ మాధవికి సూపర్‌వైజర్ మెమో జారీ చేశారు.
రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపిక
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మోడల్‌స్కూల్‌కు చెందిన విద్యార్థిని శ్రీజ రాష్ట్రస్థాయి గణిత ప్రతిభా పరీక్షకు ఎంపికై నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపల్ జహంగీర్ మంగళవారం తెలిపారు. జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షలో శ్రీజ మూడో బహుమతి పొంది ఎంపికై నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న శ్రీజను ఉపాధ్యాయులు అభినందించారు.
డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌గా రామ్మోహన్‌రావు
డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌గా రామ్మోహన్‌రావు
డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌గా రామ్మోహన్‌రావు


