ఆర్మూర్ వాసులకు ఆధ్యాత్మిక అనుభూతి
ఆర్మూర్ : మహా విష్ణువు దశావతారాలను ఇసుకతో రూపొందించి ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆర్మూర్ వాసులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో విజయ్ అగర్వాల్, లావణ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పాల ప్రదర్శనను మంగళవారం ఆయన ప్రారంభించారు. నెల రోజుల పాటు ప్రదర్శన కొనసాగనున్నందున విద్యార్థులు తిలకించి దశావతారాలతో పాటు సైకత శిల్పాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సాయి బాబా గౌడ్, షేక్ మున్ను, లింగాగౌడ్, ఖాందేశ్ శ్రీనివాస్, బాల్‌రెడ్డి, గోర్తె దేవేందర్, అతిక్, ఫయాజ్, అజ్జు, చిట్టిరెడ్డి, రాజు, భూపేందర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
జీనియస్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్
రికార్డ్స్‌లో చోటు..
సైకత శిల్పాల రూప కల్పనకు జీనియస్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పిస్తున్నట్లు అవార్డుల ప్రతినిధులు బింగి నరేందర్ గౌడ్, రాజు తెలిపారు. వారు స్వయంగా వచ్చి సైకత శిల్పాలను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. సైకత శిల్పాల రూపకర్త ఆకునూరి బాలాజీ వరప్రసాద్‌తోపాటు ప్రదర్శన నిర్వాహకులు విజయ్ అగర్వాల్, లావణ్యకు అవార్డులను ప్రదానం చేశారు.
ఆర్మూర్ వాసులకు ఆధ్యాత్మిక అనుభూతి


