ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో మంజీరా వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సోమవారం రాత్రి ఎస్సై శివకుమార్ పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మంజీరా నుంచి ఇసుకను తరలిస్తుండటంతో కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
రాజంపేట(భిక్కనూరు): రాజంపేట మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ వద్ద గొడవ పడిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు మంగళవారం తెలిపారు. పెట్రోల్ బంక్ వద్ద కారు మళ్లింపు విషయంతో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు వివరించారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేట గ్రామ శివారులో మంగళవా రం లారీని వెనుక వస్తున్న మరో లారీ ఢీకొన్న ట్లు స్థానికులు తెలిపారు. రెండు లారీలు జహీరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నాయన్నా రు. గండిమాసానిపేట గ్రామ శివారులోని జీవదాన్ పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశా డు. దీంతో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు వారు తెలిపారు.
నవీపేట: పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని బా వపై దాడి చేసిన బావమరిదిని రిమాండ్ చేసిన ట్లు ఎస్సై శ్రీకాంత్ మంగళవానం తెలిపారు. లింగాపూర్‌కు చెందిన గంధం శ్రీనివాస్ తన బా వ హన్మండ్లుతో తాగిన మైకంలో గొడవపడ్డా డు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ గొ డ్డలితో హన్మండ్లుపై దాడి చేశాడు. బాధితుడి భార్య రూప ఫిర్యాదు మేరకు నిందితుడిపై హ త్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండుకు పంపినట్లు తెలిపారు.


