కొరట్‌పల్లిలో బాలిక ఆత్మహత్య
● ప్రేమించిన బాలుడు మోసం చేయడమే కారణమంటూ మృతురాలి
కుటుంబీకులు ఆరోపణ
● ప్రియుడి ఇంటి వద్ద ఆందోళన
డిచ్‌పల్లి : మండలంలోని కొరట్‌పల్లి తండా వడ్డెర కాలనీకి చెందిన ఓ బాలిక(17) సోమవారం సా యంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇ లా.. వడ్డెక కాలనీకి చెందిన బాలిక, కొరట్‌పల్లి గ్రామానికి చెందిన బాలుడు కొన్నిరోజులుగా ప్రే మించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి ఇళ్లల్లో తెలియడంతో ఇటీవల బాలిక అతడిని కలువకుండా వారి కుటుంబీకులు కట్టడి చేశారు. అయినా వారు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో సోమవారం ఇరువురి మధ్య ఏం జరిగిందో కానీ సాయంత్రం ఇంట్లో ఎ వరూలేని సమయంలో బాలిక ఉరేసుకుని ఆత్మహ త్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రేమించిన బాలుడు మోసం చేయడంతోనే బాలిక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కొరట్‌పల్లి గ్రామంలోని బాలుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి ఎస్సై సందీప్ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు శాంతించారు. అనంతరం సాయంత్రం బాలిక మృతదేహానికి తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


