బల్దియా పోరుకు సన్నాహాలు
● ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్
● జనవరి 10న ఓటర్ల
తుది జాబితా ప్రచురణ
ఆర్మూర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించింది. ముందుగా రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్ల పరిధిలో ఓటరు జాబితా సవణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల పరిధిలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. నోటిఫికేషన్‌ను అనుసరించి వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి జనవరి 1న పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించాలి. 5న మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరించి, సవరించిన తుది జాబితాను 10న ప్రచురించాల్సి ఉంటుంది.


