బీపీ పెరగొచ్చు.. తగ్గొచ్చు
చలి ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి?
– నవీన్, నిజామాబాద్
వృద్ధులు, చిన్న పిల్లలతోపాటు గర్భిణులు, షుగర్, బీపీ, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు బయట కు వెళ్లొద్దు. అత్యవసరమైతే మాస్క్ ధరించి వెళ్లాలి.
చలి కారణంగా ఏఏ ఆరోగ్య సమస్యలు రావొచ్చు?
– రజినీ, నందిపేట
జలుబు, దగ్గు, జ్వరం, న్యుమోనియా, ఆస్తమా, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
చలిలో బయటికి వెళ్లేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– మహేశ్, ఆర్మూర్
ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలి. బయటికి వెళ్లినప్పుడు మఫ్లర్, స్వెట్టర్, టోపీ, గ్లోవ్స్ ధరించాలి.
చలిలో స్నానం ఎలా చేయాలి?
– ప్రణయ్, ఎడపల్లి
చల్లని నీటితో స్నానం చేయొద్దు. గోరువెచ్చని నీటితో త్వరగా స్నానం చేయాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఆస్తమా ఉన్నవారు ఉదయం వేళ కాకుండా ఎండ వచ్చిన తరువాత చేస్తే బాగుంటుంది.
దగ్గు, జ్వరం వస్తే ఏం చేయాలి?
– రమేశ్, నిజామాబాద్
తేలికపాటి లక్షణాలైతే విశ్రాంతి తీసుకోవడంతోపాటు తగినంత వేడి ద్రవాలు తీసుకోవాలి. మూ డు రోజులు దాటినా తగ్గకపోతే తప్పకుండా వై ద్యుడిని సంప్రదించాలి.
రాత్రి నిద్రపోయే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – శ్రీనివాస్, వర్ని
దుప్పటి సరిపడా వాడాలి. గదిలో గాలి ప్రవాహం ఉండాలి. బొగ్గు, కట్టెల మంటలు గదిలో పెట్టొద్దు.
చలికాలంలో ఎటువంటి సమయంలో ఆస్పత్రికి వెళ్లాలి? – రాధ, నందిపేట
తీవ్ర ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సో్పృహ కోల్పోవడం, ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
చలి కారణంగా గుండె సమస్యలు పెరుగుతాయా?
– రఘు, బిచ్కుంద
చలిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. గుండె వ్యాధిగ్రస్తులు మందులు మానొ ద్దు. అకస్మాత్తుగా శ్రమించొద్దు.
వారం రోజులుగా జలుబు, జ్వరం ఇబ్బంది పెడుతోంది.. – చిన్నాజీ, నిజామాబాద్
వైద్యుడిని సంప్రదించి మాత్రలు వాడండి, తగ్గకుంటే రక్త పరీక్షలు చేయించుకోవాలి. చలికాలంలో జలుబు, జ్వరం త్వరగా తగ్గే అవకాశం ఉండదు.
ఉదయం వాకింగ్‌లో విపరీతమైన తుమ్ములు వస్తున్నాయి.. – అరవింద్, నిజామాబాద్
ఉదయం వాకింగ్‌కు వెళ్లే ముందు మాస్క్, క్యాప్ ధ రించండి. ఉన్ని దుస్తులు ధరించాలి. అలర్జీ ఉంటే తీవ్రమైన తుమ్మలు వచ్చే అవకాశం ఉంది. సరైన మందులు వాడితే తగ్గే అవకాశం ఉంటుంది.
బీపీ పెరుగుతోంది.. – రమేశ్, నిజామాబాద్
చలి కారణంగా బీపీ పెరగడం, తగ్గడం జరగొచ్చు. బీపీ ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. ఒత్తిడికి గురికావొద్దు.
తరచూ జ్వరం వస్తుండడంతోపాటు కాళ్లు, చేతులు లాగుతున్నాయి.. – సుమన్, కొరట్‌పల్లి
తరచూ జ్వరం వస్తుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ జ్వరమా లేదా వైరల్ జ్వరమా అనేది తెలుస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గితే కాళ్లు, చేతులు లాగడం వంటి సమస్యలు వస్తాయి.
ఆహారంలో ఎటువంటి మార్పులు అవసరం?
– సునీత, కమ్మర్‌పల్లి
వేడి ఆహారం, సూప్‌లు, పప్పులు, కూరగాయలు తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. మద్యం, పొగతాగడం మానుకోవాలి. రాత్రి సమయంలో తయారు చేసిన భోజనాన్ని మరుసటి రోజు ఉదయం తినొద్దు. నూనెపదార్థాలు వేడిచేయడం, ఆహారపదర్థాలను వేడి చేయడం మంచిదికాదు.
చలి కారణంగా బీపీ పెరగొచ్చు.. తగ్గొచ్చు. మంచు కురిసే సమయంలో బయటికి వెళ్లొద్దు. సూర్యోదయం తరువాతే వాకింగ్ ఉత్తమం. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.. అంటూ ప్రజలకు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జలగం తిరుపతిరావు సలహాలు, సూచనలు చేశారు. తిరుపతిరావుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు సలహాలు తీసుకున్నారు.
– నిజామాబాద్ అర్బన్/సుభాష్‌నగర్
వాకింగ్ చేయొచ్చా?
– సత్యనారాయణ, నిజామాబాద్
సూర్యోదయం తరువాతే వాకింగ్ చేస్తే మంచిది. లేదా ఇంట్లోనే తేలికపాటి వ్యాయామం చే యాలి. చలితీవ్రంగా ఉన్న సమయంలో వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిది. గుండెజబ్బులు ఉంటే బయటకు వెళ్లకపోవడమే మంచిది.
చలి నుంచి రక్షణకు జాగ్రత్తలు
తీసుకోవాలి
సూర్యోదయం తరువాతే
వాకింగ్ ఉత్తమం
మంచు కురిసే సమయంలో
మాస్క్ ధరించాలి
గుండె వ్యాధులున్న వారు
జాగ్రత్తలు తీసుకోవాలి
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో జీజీహెచ్
జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్
డాక్టర్ జలగం తిరుపతిరావు
బీపీ పెరగొచ్చు.. తగ్గొచ్చు


