గోవింద.. గోవిందా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముక్కోటి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలు భక్తులతో పోటెత్తాయి. అడుగడుగునా గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఇందూరు నగరంలోని ఉత్తర తిరుపతి ఆలయంలో మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భక్తులకు ప్రవచనాలు చెప్పారు. సచ్చిదానంద స్వామి విలేకరులతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు విద్యాభ్యాసం విషయంలో ఏకాగ్రతతో వ్యవహరించాలన్నారు. స్మార్ట్ ఫో న్లకు అతుక్కుపోవద్దన్నా రు. ఫోన్లతో సైతం ఉప యోగాలు ఉంటాయని, వాటిని అవసరం మేర కు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందూ రులోని ఉత్తర తిరుపతి ఆలయం తిరుపతి ఆల యం మాదిరిగా నిర్మాణం చేశామన్నారు. ఇక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు దత్తాత్రేయ, ఆంజనేయస్వామి, లక్ష్మీ అమ్మవారు, శ్రీచక్రం ఉన్నాయన్నారు. అయోధ్య ఆలయం శైలిలో ఉత్తర తిరుపతి ఆలయ నిర్మాణం ఉందన్నారు. ప్రతి మనిషికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి పరిజ్ఞానాన్ని మంచికి వాడాలన్నారు. పిల్లలను ఆధ్యాత్మికం వైపు నడిపేందుకు పెద్దలు కృషి చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం కలుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉత్తర తిరుపతి ఆలయ కమిటీ చైర్మన్ అనఘా సంపత్, గడీల శ్రీరాములు పాల్గొన్నారు.
ఉత్తర తిరుపతి ఆలయంలో వేంకటేశ్వర స్వామిని పోలీసు కమిషనర్ పోతరాజు సాయిచైతన్య ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
సుభాష్‌నగర్ ఆలయంలో..
సుభాష్‌నగర్‌లోని శ్రీరామాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజూమున ఆలయం సమీప ప్రాంతాల్లో గరుడ వాహనంతో ఉత్సవ విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు. స్వామి ఊరేగింపు పల్లకి మోసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయ కమిటీ చైర్మన్ సరళ మహేందర్‌రెడ్డి, కార్యదర్శి శోభ నవీన్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. 40 ఏళ్లుగా ఆలయంలో ముక్కోటి ఉత్సవాలతో పాటు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.
ప్రవచిస్తున్న గణపతి సచ్చిదానంద
హోరెత్తిన వైష్ణవాలయాలు
ముక్కోటి ఏకాదశికి పోటెత్తిన భక్తులు
ఉత్తర తిరుపతి ఆలయంలో
స్వామి గణపతి సచ్చిదానంద
ప్రవచనాలు


