ఈ ఏడాది సవాళ్లను అధిగమించాం..
నిజామాబాద్ అర్బన్: పోలీసు సిబ్బంది అంకిత భావం, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ ఏడాదిలో సవాళ్లను విజయవంతంగా అధిగమించామని పోలీసు కమిషనర్ సాయి చైతన్య పే ర్కొన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో సీపీ వార్షి క నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఆయ న మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడకుండా రిటైర్డ్ ఉద్యోగులకు, మార్నింగ్ వాకర్స్‌కు అవగాహ న కల్పించామన్నారు. ‘సే నో టు డ్రగ్స్ –సే ఎస్ టు స్పోర్ట్స్’ నినాదంతో యువతకు క్రీడలు నిర్వహించామన్నారు. జాతీయ రహదారులపై అంతర్ రాష్ట్ర నేరాస్తుల దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి వ చ్చే ‘ పాయింట్ ఆఫ్ ఎంట్రీలపై నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఏడాది విధి ని ర్వహణలో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పో యారని, వారి కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పు డూ అండగా ఉంటుందన్నారు. కల్తీ విత్తనాల నియంత్రణ, గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించామన్నారు. 20 మందికి 12 కేసుల్లో జీవితఖైదు శిక్ష పడింది. ఆరుగురికి ఆరు కేసుల్లో పది సంవత్సరాల జైలు శిక్ష పడింది. నలుగురికి నా లుగు కేసుల్లో ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది.
● గతేడాది 857 రోడ్డు ప్రమాదాల్లో 353 మంది మృతి చెందగా, ఈ ఏడాది 780 రోడ్డు ప్రమాదాల్లో 276 మంది మృతిచెందారు.
వార్షిక నివేదికలో ‘సాక్షి’ కథనాలు..
వార్షిక నివేదికలో పో లీసు శాఖకు సంబంధించి వివిధ ఘటనలు, కార్యక్రమాలపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలను ప్రచురించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, రామచంద్రరావు, ఏసీపీలు శ్రీనివాస్, రాజావెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మస్తాన్‌అలీ, రాజశేఖర్ తదితరులున్నారు.
జిల్లాలో జరిగిన నేరాలు
2024 2025
అన్ని రకాల నేరాలు 8983 8624
డ్రంక్‌అండ్‌డ్రైవ్ 8410 17,627
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ 107 83
హత్యలు 43 50
హత్యాయత్నం 62 101
కిడ్నాప్‌లు 126 165
చీటింగ్ 758 700
ఇంటి దొంగతనాలు 404 439
సాధారణ దొంగతనాలు 35 21
మహిళలపై..
అఘాయిత్యాలు 747 783
వరకట్న మరణాలు 3 2
ఆత్మహత్యాయత్నాలు 20 25
అత్యాచారాలు 83 89
కిడ్నాప్‌లు 86 135
వేధింపులు 328 322
పోక్సో కేసులు 120 168
2024 2025
సైబర్‌క్రైమ్ కేసులు 2339 2411
చైన్‌స్నాచింగ్ 40 39
తగ్గిన నేరాలు..
పోలీసు సిబ్బంది అంకిత భావంతో
పనిచేశారు
ఎనిమిది మంది పోలీసులు
ప్రాణాలు కోల్పోయారు
వార్షిక నివేదిక విడుదల చేసిన
సీపీ సాయిచైతన్య


