కోనాపూర్ హెచ్‌ఎంకు గణిత రత్న అవార్డు
కమ్మర్‌పల్లి: మండలంలోని కోనాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం చౌడారపు రామ్‌ప్రసాద్ కు గణిత రత్న అవార్డు లభించింది. గణిత బోధనలో విశేష కృషి, టీచింగ్ లెర్నింగ్ మె టీరియల్ తయారీ, ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో వి ద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందు కు గాను తెలంగాణ గణిత ఫోరం నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో గణిత రత్న అ వార్డు ప్రదానం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు.
వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం కార్యవర్గం
సుభాష్‌నగర్: జిల్లా వైద్యారోగ్యశాఖలో తె లంగాణ వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం కార్యవర్గాన్ని నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం ఎన్నుకున్నారు. అంతకుముందు జిల్లా అధ్యక్షుడు ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు, యూనియన్ బలోపేతం, నూతన సంవత్సర క్యాలెండర్, జిల్లా కమిటీ ఎన్నిక, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ కార్యక్రమాలు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో సంచరించే ఉద్యోగులకు ఆన్‌లైన్ అటెండెన్స్ ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 30 ఏళ్లుగా ఏఎన్‌ఎంలకు ప దోన్నతులు లభించడం లేదని ప్రస్తావించా రు. అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్ వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షులుగా ఏ యాదమ్మ, ఉపాధ్యక్షులుగా వీ ప్రవీణ్ రెడ్డి, బి బేబీరాణి, ఎం రవి గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం గంగామణి, పి మండోదరి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జి విమలేశ్వరి, సోలోమన్ రాజ్, ఎస్ స్వామి, జి సురేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎస్ శ్యామ ల, జి విజయ, ఈ సుధాకర్, టి రమేష్, డి మధుసూదన్ ఎన్నికయ్యారు.
కొనసాగుతున్న
రెల్వే డబుల్ ౖలైన్ పనులు
● ట్రాఫిక్‌కు అంతరాయం
నవీపేట: డబుల్ రైల్వే లైన్ విస్తరణ పనులు కొనసాగడంతో మండల కేంద్రంలోని ప్రధా న రైల్వేగేటు సమీపంలో మంగళవారం ట్రా ఫిక్‌కు అంతరాయం కలిగింది. మేడ్చల్ –ముద్‌ఖేడ్ డబుల్ రైల్వే లైన్ పనులలో భాగంగా నవీపేట నుంచి బాసర వరకు మొ దటి దశ పనులు పూర్తి కానున్నాయి. జనవరిలో 13 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌పై రైలు పరుగెత్తనుంది. ఇరువైపులా లైన్ విస్తరణ పనులు పూర్తయ్యాయి. నవీపేట మండల కేంద్రంలో ట్రాక్ వద్ద పనులను మంగళవారం నిర్వహించారు. ట్రాక్ లెవల్, బీటీ భ ర్తీ పనులను నిర్వహించడంతో గేటును కొద్దిసేపు మూసేశారు. వాహనాల రద్దీతో ట్రాఫి క్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వా హనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
కోనాపూర్ హెచ్‌ఎంకు గణిత రత్న అవార్డు


