ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు
నిజామాబాద్ రూరల్ : ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్య మని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నా రు. నగరంలో తాగునీటి సమస్య శాశ్వాత పరిష్కా రం కోసం రూ.6 కోట్ల 50 లక్షల వ్యయంతో ఆధునిక వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కేకే గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో షబ్బీర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేగంగా పెరుగుతున్న జనాభా, నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తయితే నగరంలోని పలు ప్రాంతాల్లో ఏళ్లుగా ఉన్న నీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఆటోనగర్ ప్రాంతంలో 16 లక్షల లీటర్ల సామర్థ్యం గల, సైలనీ నగర్‌లో 9 లక్షల లీటర్ల, మదీనా ఈద్గా సమీపంలో 9 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నరాల రత్నాకర్, మైనార్టీ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నగర జనాభా, విస్తరణను దృష్టిలో
ఉంచుకుని నిర్ణయాలు
రూ.6కోట్ల 50 లక్షలతో ఆధునిక
వాటర్ ట్యాంకులు
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ఆధునిక వాటర్ ట్యాంకుల
నిర్మాణానికి శంకుస్థాపన


