జెండాబాలాజీ ఆలయంలో..
నగరంలోని శ్రీ జెండాబాలాజీ దేవస్థానంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పూజలు చేశారు. ఆలయంలో తెల్లవారుజామున స్వామికి గరుడవాహన సేవ, ఊరేగింపు నిర్వహించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారి సేవలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ ఆలయానికి మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేణు, దేవాదాయ శాఖ పరిశీలకులు కమల, చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్, ధర్మకర్తలు వేముల దేవిదాస్, పోలకొండ నర్సింగ్‌రావు, సిరిపురం కిరణ్, కొర్వ రాజ్‌కుమార్, విజయ పాల్గొన్నారు.


