ఇలా త్రిపాఠి
జిల్లా కలెక్టర్‌గా
● వినయ్‌కృష్ణారెడ్డి బదిలీ
నిజామాబాద్ అర్బన్: జిల్లా కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి నియమితులయ్యారు. మంగళవా రం రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఇలా త్రిపాఠిని జిల్లాకు కేటాయించారు. ఆమె 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్, ఇదివరకు పనిచేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మల్కాజ్‌గిరి , ఉప్పల్, ఎల్‌బీ నగర్ జోన్ పరిధిలోని అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. వినయ్‌కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 13న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలల్లోనే అతి తక్కువ కాలంలోనే కలెక్టర్ బదిలీ కావడం విశేషం. ఇటీవల గ్రామ పంచా యతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించా రు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆకస్మిక బదిలీ జరిగింది.


