విజేతలకు చాంపియన్‌షిప్ ట్రోపీలు ప్రదానం
సుభాష్‌నగర్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన క్రాస్ కంట్రీ, కిడ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలకు నాగారంలోని రాజారాం స్టేడియంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నరాల రత్నాకర్, రాజాగౌడ్ మెడల్స్, చాంపియన్‌షిప్ ట్రోపీలను అందజేశారు. అండర్–8 విభాగంలో సిద్ధార్థ హైస్కూల్ (నందిపేట్), జీఎఫ్‌ఎస్ పాఠశాల (వన్నెల్–కే), అండర్ – 10 విభాగంలో విజయ్ హైస్కూల్ (నిజామాబాద్), మల్లారెడ్డి పాఠశాల (వర్ని), అండర్ – 12 విభాగంలో ఎంజేపీ బాయ్స్ (రాంపూర్), టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ బాయ్స్ (పోచంపాడ్), అండర్ –14 విభాగంలో వెక్టర్ పాఠశాల (నిజామాబాద్), ఎంజేపీ బాలికలు (బాల్కొండ) చాంపియన్‌షిప్ ట్రోపీలను అందుకున్నాయి. అనంతరం ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ మాట్లాడుతూ జనవరి 2న రంగారెడ్డి జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు క్రాస్ కంట్రీ జట్టును ఎంపిక చేసి పంపించామన్నారు. జనవరి 18న ఆదిలాబాద్‌లో జరగబోయే కిడ్స్ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలకు పంపించామని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


