ఆర్మూర్‌లో సైకత శిల్పాలు
ఆధ్యాత్మికత ఉట్టి పడుతుంది
సద్వినియోగం చేసుకోవాలి
● దశావతారాలతో ప్రదర్శనకు సిద్ధం
● నేడు ప్రారంభించనున్న అగ్గు మహరాజ్
● రాష్ట్రంలోనే మొదటిసారిగా
సైకత శిల్పాల ప్రదర్శన
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో విష్ణుమూర్తి దశావతారాలతోపాటు వినాయకుడు, అనంత పద్మనాభ స్వామి సైకత (ఇసుక) శిల్పాలు ఆధ్యాత్మిక శోభ ఉ ట్టిపడేలా కనువిందు చేయనున్నాయి. వైకుంఠ ఏ కాదశి సందర్భంగా ఈ నెల 30వ తేదీ మంగళ వారం సైకత శిల్పాల ప్రదర్శన ప్రారంభం కానున్నది. పట్టణానికి చెందిన విజయ్ అగర్వాల్, లావణ్య (లావణ్య టూర్స్ అండ్ ట్రావెల్స్) సంయుక్తంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా సైకత శిల్పాల ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. విజయవాడకు చెందిన సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వర ప్రసాద్‌ను ప్రత్యేకంగా పిలిచి పది రోజులుగా సైకత శిల్పాలను రూపొందిస్తున్నారు. మహాలక్ష్మి కాలనీలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రజలు, విద్యార్థులు సందర్శించేందుకు అందుబాటులో ఉంచారు. విష్ణుమూర్తి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశురామ, రాముడు, కృష్ణుడు, బలరాముడు, కల్కి అవతారాలను కళ్లకు కట్టినట్లుగా ఇసుకతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. అమ్దాపూర్ నర్సింహస్వామి ఆలయ అగ్గు మహరాజ్ మంగళవారం ప్రదర్శనను ప్రారంభించనున్నారు.
దశావతారాల ప్రదర్శనతో పట్టణంలో ఆధ్యాత్మికత ఉట్టి పడుతుందనే నమ్మకంతో నా సోదరుడి సహాయంతో సైకత శిల్పాల ప్రదర్శనను ఏర్పాటు చేశాం. నామ మాత్రపు ఎంట్రీ టికెట్ చెల్లించి వీక్షకులు ఈ ప్రదర్శనను నెల రోజుల పాటు చూసి అలరించవచ్చు.
– లావణ్య, శిబిరం నిర్వాహకురాలు, ఆర్మూర్
రాష్ట్రంలో మొదటిసారిగా సైకత శిల్పాలతో దశావతారాల ప్రదర్శన నిర్వహిస్తున్నందన ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సందర్భం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని బీచ్‌లలో సోషల్ అవేర్‌నెస్ కల్పిస్తూ సైకత శిల్పాలు రూపొందించాను.
– ఆకునూరి బాలాజీ వరప్రసాద్,
సాండ్ ఆర్టిస్ట్, విజయవాడ
ఆర్మూర్‌లో సైకత శిల్పాలు
ఆర్మూర్‌లో సైకత శిల్పాలు
ఆర్మూర్‌లో సైకత శిల్పాలు


