వన్యప్రాణులను వేటాడొద్దు
నందిపేట్(ఆర్మూర్):అడవులు, వన్యప్రాణుల రక్ష ణ అత్యంత కీలకమని, వన్యప్రాణులను వేటాడ డం నేరమని నందిపేట ఫారెస్టు డిప్యూటీ రేంజ్ అఽ దికారి సుధాకర్ సూచించారు. మండలంలోని అ యిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం అట వీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ సమతుల్యత,అటవీ సంరక్షణ అవసరం,వన్యప్రాణుల ప్రా ధాన్యత,చట్టాలఅమలు,ప్రజల బాధ్యతను సుధాకర్ క్షుణ్ణంగా వివరించారు.ప్రకృతిలో పాముల పాత్రను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా స్నేక్ స్నాచర్లు షేక్ మున్నా, అంజాద్ వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ,హెచ్‌ఎం లాలయ్య, జూనియర్ కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, సాయాగౌడ్, శ్రీకాంత్, సీఆర్‌పీ రాజు పాల్గొన్నారు.
● జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్
కమ్మర్‌పల్లి: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులు, క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలందించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని 108 నిజామాబాద్, నిర్మల్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్ సూచించారు. ఆయన సోమవారం కమ్మర్‌పల్లిలో 108 అంబులెన్స్ వాహనాన్ని, రికార్డులను తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న మందులు, వైద్య పరిక రాలు వాటి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అ నంతరం జనార్దన్ మాట్లాడుతూ గర్భిణులను ప్ర సవ సమయంలో ఆస్పత్రికి అంబులెన్స్‌లోనే తర లించేలా క్షేత్రస్థాయి వైద్య సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాహనాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా కో ఆర్డినేటర్ స్వరాజ్, 108 సిబ్బంది ఈఎంటి జగదీశ్, పైలెట్ శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.
వన్యప్రాణులను వేటాడొద్దు


