సురక్షితమైన ఆహారంతోనే ఆరోగ్యం
తెయూ(డిచ్‌పల్లి): సురక్షితమైన ఆహారంతోనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం సురక్షితమై న ఆహారంపై తెయూలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యాదగిరి మాట్లాడుతూ.. హాస్టల్స్ సిబ్బంది ఎల్లప్పుడూ విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ శుభ్రమైన రుచికరమైన ఆహారం అందించడంతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సిబ్బంది విఽ దులు నిర్వహించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు సునీత,నవీత,ట్రైనర్ భావన హాస్టళ్లలో ఆహార త యారీ విధానాలు,పరిశుభ్రత, నిల్వ విధానం, భద్ర తా ప్రమాణాలపై అవగాహన కల్పించారు.వంటగదుల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, ఆ ప్రాన్స్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ని ర్వాహకులు భాష బాబు,వార్డెన్లు గంగాకిషన్, జ్యో త్స్న, కిరణ్ రాథోడ్, కేర్ టేకర్లు క్రాంతికుమార్, ది గంబర్ చౌహాన్, రమేశ్, సుభాన్ రావు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
వర్సిటీలో ఫుడ్ సేఫ్టీపై అవగాహన


