జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థిని ర్యాపాన్ గంగోత్రి జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ గంగామోహన్ తెలిపారు. ఈ నెల 26 నుంచి 28 వరకు మంచిర్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–19 సాఫ్ట్‌బాల్ పోటీల్లో గంగోత్రి ప్రతిభ కనబర్చి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జనవరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందని పీడీ తెలిపారు. గంగోత్రిని ఇన్‌చార్జి ఎంఈవో, హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.
నిజామాబాద్ రూరల్: యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి అన్నారు. నగరంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం సర్పంచులుగా ఎన్నికై న యూత్ కాంగ్రెస్ నాయకులను సన్మానించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జిలు అల్మాస్ ఖాన్, వినోద్, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నరేందర్ గౌడ్, రాజు గౌడ్, ఆదిత్య, అబ్బోల్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమ ని, వారి భవిష్యత్ నిర్మాణానికి గురువులే పునా ది అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో ఆదివారం స్టేట్ టీ చర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయడమే ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. సంఘ ప్రతినిధులు శ్రీకాంత్, ధర్మేందర్, బెల్లాల్ శ్రీనివాస్, మహేశ్వర్, యాదగిరి, సాయి తేజ, కృష్ణ విజయ సారధి, రత్నాకర్, సురేష్ కుమార్, గోలి ప్రకాష్, శ్రీనివాస్ కిషన్, గణేష్ భూపతి రాజు, అబ్బాయా, యూసఫ్ పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక


