పరుగు పందెంలో సత్తాచాటిన అక్కాచెల్లెళ్లు
బోధన్‌టౌన్(బోధన్): జిల్లాకేంద్రంలో ఇటీవల నిర్వహించిన పరుగుపందెం పోటీల్లో బోధన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రతిభ చాటారు. పట్టణంలోని విజయసాయి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న తోకల అనన్య, తోకల మోక్ష అక్కాచెల్లెల్లు. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో అథ్లెటిక్ క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 12 బాలికల విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో వారు పాల్గొన్నారు. 6వ తరగతి చదువుతున్న అనన్య ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వగా, 5వ తరగతి చదువున్న మోక్ష తృతీయ స్థానంలో నిలిచి సత్తా చాటిందని అథ్లెటిక్స్ ఫిట్‌నెస్ క్లబ్ బోధన్ కోచ్ రహన్ తెలిపా రు. పరుగు పందెంలో అక్కాచెల్లెల్లు విజేతలు గా నిలవడం అభినందనీయం కోచ్ అన్నారు.
ఆర్మూర్: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో శనివారం భరత్ ఆర్ట్స్ అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన కూచిపూడి కళ వైభవం–2, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనవరాలు జయరెడ్డి స్థానం సంపాదించుకుంది. నాట్య గురువు నవ్య నాగబండి శిక్షణలో ఒకే వేదికపై ఒకేసారి 7,209 మంది చిన్నారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఈ బృందంలో ఆర్మూర్ ఎమ్మెల్యే కూతురు ఆర్‌ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి కూతురు చిన్నారి జయరెడ్డి ప్రదర్శన ఇచ్చి, రికార్డులో భాగం అయింది. దీంతో తాత ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, చిన్నారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ రూరల్: జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఉదయం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు.
పరుగు పందెంలో సత్తాచాటిన అక్కాచెల్లెళ్లు


